వైశాఖ పౌర్ణమి సందర్భంగా, ఏప్రిల్ 30న కడప, రాయచోటి నుంచి అరుణాచలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కడపలో ఉదయం 9 గంటలకు, రాయచోటిలో 10:15 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. టికెట్ ధర రూ. 1050గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో లేదా 9966690850 నంబర్‌కు ఫోన్‌పే చేసి టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ఫోన్ ఛార్జింగ్, పుష్ బ్యాక్ సీట్లు వంటి సౌకర్యాలు ఉంటాయని కడప డీఎం వివరించారు.