రామాంజనేయ పురం, కడపలో 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2025-26 ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్ కళాశాలల నుండి సుమారు 1700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లాంగ్ జంప్, 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు, ట్రిపుల్ జంప్‌లలో బి. భవ్య శ్రీ స్టేట్ ఓవరాల్ ఇండివిజల్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నారు. హై జంప్, షాట్‌పుట్, 4×100 మీటర్ల పరుగులో కళ్యాణి, నాని, వెన్నెల, 800 మీటర్ల పరుగులో సి. శిరీష, ఖోఖోలో సాయి కీర్తి, హర్షియా, చిట్టి, లక్ష్మీ రెడ్డమ్మ, ఉషశ్రీ ఛాంపియన్‌షిప్‌లు కైవసం చేసుకున్నారు. కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్టేట్ ఓవరాల్ చాంపియన్స్‌గా నిలిచింది. ప్రిన్సిపాల్ శ్రీమతి సిహెచ్ జ్యోతి విద్యార్థులను అభినందించారు.