కడప శిల్పారామంలో ఆదివారం సాయంత్రం పద్మాకర్ సహకారంతో నృత్య ప్రదర్శనలు వైభవంగా జరిగాయి. పల్లె జానపద, శాస్త్రీయ, మరియు సినీ నృత్యాలతో కళాకారులు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ముఖ్యంగా వనలాడి టిక్కులాడే, రింగ్ జుట్టుదానా, ఆయుధ పూజ, మసాజాతర్ పాటలకు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి. ఈ వేడుక శిల్పారామం పరిపాలన అధికారి పి. శివ ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో సాగింది.