ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి: సీపీఎం

501చూసినవారు
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి: సీపీఎం
ఆదివారం కడపలో సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, స్లీపర్ బస్సుల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదని, లైసెన్స్ లేని డ్రైవర్లతో బస్సులు, విద్యాసంస్థల వాహనాలు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే చర్యలు చేపట్టకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్