భాషతో పాటు సాంకేతిక నైపుణ్యాలు కీలకం: వైవీయూ వీసీ

411చూసినవారు
భాషతో పాటు సాంకేతిక నైపుణ్యాలు కీలకం: వైవీయూ వీసీ
యోగి వేమన విశ్వవిద్యాలయం ఉర్దూ విభాగంలో 'జ్ఞాన సముపార్జనలో నూతన కోణాలు' అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా వీసీ బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు భాషా పరిజ్ఞానంతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఉర్దూ వర్సిటీ తొలి వీసీ ముజఫ్ఫర్ అలీ, వైవీయూ రిజిస్ట్రార్ పద్మ కూడా పాల్గొని, బహుభాషా ప్రావీణ్యం పరిశోధనలకు ఎంతో సహాయపడుతుందని, ఉర్దూ భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్