కడపలోని శ్రీ ఉమేష్ చంద్ర కల్యాణ మండపం అలంకరణ పనులకు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ టెండర్లను ఆహ్వానించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2027 వరకు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏప్రిల్ 15న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బహిరంగ వేలం జరుగుతుంది. వివరాలకు ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లను 9121100648 నంబర్లో సంప్రదించవచ్చు అని తెలిపారు.