కడప నగరంలోని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 46వ డివిజన్‌కు చెందిన
వైసీపీ కార్పొరేటర్ జమీల్ ఏజెంట్ అప్రోజ్పై,
టీడీపీ అభ్యర్థి హనీఫ్ ఏజెంట్లు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు.