వైఎస్సార్ కడప జిల్లాలోని ఎర్రముక్కపల్లి గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించిన గణేష్ విగ్రహాలను యువకులు డీజే, కోలాహలం మధ్య చెరువులో భక్తితో నిమజ్జనం చేశారు. మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల వాడకం ప్రశంసనీయం. గ్రామస్తులు, చిన్నపిల్లల నుండి పెద్దల వరకు 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో ఉత్సవంలో పాల్గొన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.