పేదల పెన్షన్లు ఆపితే పోరాటం: సీపీఎం

1136చూసినవారు
పేదల పెన్షన్లు ఆపితే పోరాటం: సీపీఎం
కడప నగరంలో అర్హులైన పేదలందరికీ వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. గురువారం నాడు కడప నగరంలోని 35 డివిజన్ నకాష్ పరిధిలో ఉన్న పేదలందరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మంది పేదల పెన్షన్లను నిలిపివేసిందని, కమ్మరగిరి పార్వతికి గత ఏడాదిగా వితంతు పెన్షన్ నిలిపివేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లలో కోత విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సచివాలయ పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్