కడపలో వైసీపీ నాయకుల అరెస్ట్!

1994చూసినవారు
కడపలో వైసీపీ నాయకుల అరెస్ట్!
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం కడప ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, సురేష్ బాబు, నిత్యానంద రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ పీఎస్‌కు తరలించారు. మహిళలన్న గౌరవం లేకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం, భారీగా బలగాలను మోహరించి ప్రజలకు ఇబ్బంది కలిగించడంపై వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్