కడప కలెక్టరేట్‌లో
వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తదితరులు డీఆర్ఓ మల్లికార్జునుడును కలిశారు. ఎస్ఆర్ఏ గడువు పెంచాలని వారు కోరారు. అంజాద్ బాషా తన ఓటు గల్లంతు కావడం, చాపాడు మండలంలో భారీగా ఓట్లు తొలగించడంపై ఫిర్యాదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.