యోగి వేమన వర్సిటీ భౌతికశాస్త్ర పరిశోధక విద్యార్థి పెద్దన్న మోతికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'డిఎస్‌టీ-ఇన్‌స్పైర్' ఫెలోషిప్ లభించింది. అసోసియేట్ ప్రొఫెసర్ డా. వి. వెంకట్రాము పర్యవేక్షణలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన అధునాతన మెటీరియల్స్ రూపకల్పనపై ఆయన ఐదేళ్లు పరిశోధన చేస్తారు. గ్రామీణ ప్రాంత వర్సిటీకి ఈ గుర్తింపు రావడం గర్వకారణమని వీసీ ఆచార్య బి. రాజశేఖర్, రిజిస్ట్రార్ పద్మ, ప్రిన్సిపాల్ టి. శ్రీనివాస్ అభినందించారు.