రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపు మేరకు కడప జిల్లాలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించి, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బి కిషోర్, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ అలీ, నగర కార్యదర్శి చెన్నారెడ్డి, కార్యకర్తలు ఉదయ్, చందు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.