మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు: వైఎస్ఆర్సిపి యువ నాయకుల ఖండన

747చూసినవారు
మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు: వైఎస్ఆర్సిపి యువ నాయకుల ఖండన
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ల నివాసాలపై జరిగిన దాడులను వైఎస్ఆర్సిపి యువ నాయకులు క్రిష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టడం అరాచకానికి పరాకాష్ట అని ఆయన అన్నారు. మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అరాచక శక్తులకు వత్తాసు పలకడం మానుకోవాలని, ప్రతి అరాచకానికి ప్రజలే తీర్పు చెబుతారని హెచ్చరించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్