శ్రీరామాపురం ఆలయంలో భీష్మ ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం నేడు

680చూసినవారు
శ్రీరామాపురం ఆలయంలో భీష్మ ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం నేడు
వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలంలోని శ్రీరామాపురం మహా పుణ్యక్షేత్రంలో గురువారం మాఘమాస శుక్లపక్ష భీష్మ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ మోక్ష నారాయణ స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతినెలా ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరవడం ఈ ఆలయ ప్రత్యేకత. సాయంత్రం 5:30 గంటలకు గరుడోత్సవం, అనంతరం మహా మంగళహారతి, తీర్థ ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్తర ద్వార దర్శనంతో భక్తులకు సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్