గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారికి మద్దతిచ్చే రాజకీయ నేతలపై కేసులు నమోదు చేయాలని రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. గురువారం కడప నగరంలో ఆమె మాట్లాడుతూ, ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ టీడీపీ నేతను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. మత్తు పదార్థాల వల్ల మహిళలకు రక్షణ కరువవుతోందని, మాఫియాను అరికట్టకపోతే మహిళా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాలను ఆమె హెచ్చరించారు.