చంద్రబాబు ప్రజా ద్రోహం: వైఎస్ఆర్సీపీ నిరసన

1473చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాశీభట్ల సాయినాథ శర్మ, రెడ్డెం సుబ్బారెడ్డి, క్రిష్ణా రెడ్డి, కార్యకర్తలు భారీగా పాల్గొని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమం 2026 జూన్ 12న జరిగింది.

సంబంధిత పోస్ట్