కమలాపురం నియోజకవర్గం కొప్పోర్తి వద్ద ఇటీవల జరిగిన 'ఏపీ, తెలంగాణ రాష్ట్రాల దీనీ ఇస్తమా' సభ విజయవంతమైంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగిన ఈ సభకు సహకరించిన ఏపీ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిలకు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి సహకారంతోనే కార్యక్రమం విజయవంతమైందని ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు.