యోగి వేమన వర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో శనివారం 8 మంది విద్యార్థులను మాల్‌ప్రాక్టీస్ కింద గుర్తించి డిబార్ చేశారు. మైదుకూరులో ఇద్దరు, పుల్లారెడ్డిపేటలో ఆరుగురిని అధికారులు బహిష్కరించారు. హైపవర్ కమిటీ సభ్యులు పలు పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం జరిగిన పరీక్షలకు మొత్తం 7,322 మంది విద్యార్థులు హాజరయ్యారు.