చింతకొమ్మదిన్నె మండలంలోని యోగివేమన దత్తత గ్రామం శివాజీ నగర్‌లో ఆదివారం యోగి వేమన వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-9 విద్యార్థులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. డా. కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి, బడి మానేసిన ఆడపిల్లలను తిరిగి బడికి పంపాలని తల్లిదండ్రులను కోరారు. బాల్య వివాహాలు వద్దంటూ వీధుల్లో నినాదాలు చేశారు. మహిళా హక్కులు, వ్యక్తిగత పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు.