కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక రోగి సులోచన మృతి చెందడంపై
వైసీపీ నేత సత్య సాయినాథ్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోవడం విచారకరమని, వైద్యులు లేక ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల పాలై నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. మెరుగైన వైద్య సేవలు అందించకపోతే పార్టీ శ్రేణులతో కలిసి ఆసుపత్రి ఎదుట భారీ ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.