కడప: ఉన్నత చదువులకు వరం పీఎం విద్యాలక్ష్మి

356చూసినవారు
కడప: ఉన్నత చదువులకు వరం పీఎం విద్యాలక్ష్మి
గురువారం యోగి వేమన వర్సిటీలో పీఎం విద్యాలక్ష్మి పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు ఎలాంటి హామీ లేకుండానే ఉన్నత చదువులకు రుణాలు పొందవచ్చని ఎస్బీఐ మేనేజర్ జగన్నాథ్ తెలిపారు. దేశ విదేశాల్లోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివేవారికి ఇది ఉపయోగకరమని, అర్హులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్