రామాపురం మహా పుణ్యక్షేత్రంలో కామదా ఏకాదశి వేడుకలు

1242చూసినవారు
రామాపురం మహా పుణ్యక్షేత్రంలో కామదా ఏకాదశి వేడుకలు
రామాపురం మహా పుణ్యక్షేత్రంలో ఈ నెల 29న (ఆదివారం) చైత్రమాస శుక్లపక్ష తొలి ఏకాదశి సందర్భంగా కామదా ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దేవతామూర్తుల దర్శనం కల్పించనున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణ హోమం, నిత్య కళ్యాణం, సాయంత్రం 5 గంటలకు గరుడ వాహనంపై మహాలక్ష్మి సమేత మోక్ష నారాయణ స్వామి ఊరేగింపు, అనంతరం మహా మంగళహారతి ఉంటాయి. భోజన, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్