లడ్డూ వివాదం: కమలాపురంలో నరేన్ 'పాప ప్రక్షాళన'

249చూసినవారు
లడ్డూ వివాదం: కమలాపురంలో నరేన్ 'పాప ప్రక్షాళన'
తిరుమల లడ్డూలో కల్తీ లేదని సిట్ నివేదిక వెల్లడించినా, కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారని కమలాపురం వైసీపీ ఇన్‌చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఆయన శనివారం స్థానిక వెంకటేశ్వరాలయంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించి, 101 కొబ్బరికాయలు కొట్టారు. స్వార్థ రాజకీయాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్, లోకేష్‌లు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్