కమలాపురంలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు

719చూసినవారు
కమలాపురంలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు
కమలాపురం సిఎస్ఐ టౌన్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ జీవన్ సుకుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రైల్వే గేట్ నుండి చర్చి వరకు ఈత, అంజూరపు మట్టలు చేతబూని, భక్తి గీతాలు ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చి చుట్టూ ప్రదర్శనగా తిరిగి, ఆలయంలోకి ప్రవేశించి ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో పిల్లలు, క్రైస్తవ సహోదరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్