నేడు పెండ్లిమర్రిలో ఎమ్మెల్యే చైతన్య రెడ్డి పర్యటన

1221చూసినవారు
నేడు పెండ్లిమర్రిలో ఎమ్మెల్యే చైతన్య రెడ్డి పర్యటన
పెండ్లిమర్రిలో నూతనంగా నిర్మించిన కస్తూరిబా గాంధీ కళాశాల ప్రారంభోత్సవం నేడు గురువారం ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి కమలాపురం ఎమ్మెల్యే పి. కృష్ణ చైతన్య రెడ్డి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు సంగటి గంగిరెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్