పెండ్లిమర్రిలో కేజీబీవీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

890చూసినవారు
పెండ్లిమర్రిలో కేజీబీవీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
పెండ్లిమర్రి మండలంలో నూతనంగా నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. బాలికలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్