తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి

1029చూసినవారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి
బుధవారం ఉదయం కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, యువ నాయకుడు పుత్తా లక్ష్మి రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్