కీర్తిపల్లిలో బండ లాగు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

309చూసినవారు
కీర్తిపల్లిలో బండ లాగు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
వీరాపునాయునిపల్లి మండలం కీర్తిపల్లిలో శనివారం నల్లనమ్మ అమ్మవారి తిరునాళ్లు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఏర్పాటు చేసిన బండ లాగు పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్