కమలాపురం, ఖాజీపేట మధ్య ఏటూరు బ్రిడ్జి వద్ద నదుల్లో ఇసుక తవ్వొద్దని ఆదేశాలున్నా, అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. బహిరంగంగా జరుగుతున్న ఈ దోపిడీపై అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ రవాణాను అడ్డుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.