వేలూరుపాడులో శ్రీ భీమేశ్వర స్వామి తిరునాళ్లు: ఎడ్ల పోటీల్లో రామచంద్రారెడ్డి ఎద్దులకు ద్వితీయ బహుమతి

9చూసినవారు
వేలూరుపాడులో శ్రీ భీమేశ్వర స్వామి తిరునాళ్లు: ఎడ్ల పోటీల్లో రామచంద్రారెడ్డి ఎద్దులకు ద్వితీయ బహుమతి
వైఎస్సార్‌ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం వేలూరుపాడు గ్రామంలో ఆదివారం, సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పోటీల్లో రామచంద్రారెడ్డి ఎద్దులు ద్వితీయ బహుమతిగా రూ.80 వేల నగదును గెలుచుకున్నాయి. ఈ నగదు బహుమతిని మల్లాయపల్లి గ్రామం తరఫున అందజేశారు. విజేతలను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు, ప్రేక్షకులు పాల్గొని తిరునాళ్లను తిలకించారు.

సంబంధిత పోస్ట్