వల్లూరు పెన్నా నది వంతెన కింద తీవ్ర గాయాలతో ఉన్న ఒక యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని ఎర్రగుంట్ల క్రాంతి నగర్‌కు చెందిన దుంపలగట్టు వెంకటసుబ్బయ్యగా గుర్తించారు. వంతెనపై అతని స్కూటీ కూడా లభించింది. పైనుంచి పడి మరణించి ఉండవచ్చని ఎస్ఐ శివనాగిరెడ్డి భావిస్తున్నారు. మృతుని బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.