వల్లూరు: ఉత్సాహంగా 'వేదాస్ ఉత్సవ్' క్రీడా పోటీలు

456చూసినవారు
వల్లూరు: ఉత్సాహంగా 'వేదాస్ ఉత్సవ్' క్రీడా పోటీలు
వల్లూరు మండలం ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని వేదాస్ పబ్లిక్ స్కూల్‌లో శనివారం 'వేదాస్ ఉత్సవ్ 25-26' క్రీడా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా 20 పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఫౌండర్ శివరాం రెడ్డి ఈ క్రీడా సంబరాలను ప్రారంభించారు. వాలీబాల్, ఖో-ఖో, చెస్, రన్నింగ్ వంటి వివిధ రకాల పోటీలు నిర్వహించబడ్డాయి. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దిలీప్ రెడ్డి, ప్రిన్సిపాల్ ధీరజ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్