పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లెలో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమాన్ని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం ద్వారా ప్రజలకు అందించే సేవలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,
టీడీపీ నాయకులు పాల్గొన్నారు.