కమలాపురం - Kamalapuram

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా
Jan 14, 2026, 18:01 IST/వరంగల్ (ఈస్ట్)
వరంగల్ (ఈస్ట్)

రంగశాయిపేటలో సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో గోదాదేవి కళ్యాణం ఘనం

Jan 14, 2026, 18:01 IST
వరంగల్ మహానగరం 42వ డివిజన్ రంగశాయిపేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బుధవారం భోగి పండుగ సందర్భంగా గోదాదేవి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల శ్రీధర్ చార్యులు వేదమంత్రాలతో ఈ కళ్యాణాన్ని జరిపించారు. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ఈవో వెంకట్రాజ్యం, ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ పులిగిల్ల వెంకటరమ నరసింహ శాస్త్రి, కార్పొరేటర్ కేడల పద్మా జనార్ధన్, ఆడెపు వెంకటస్వామి దంపతులు, ఆలయ సేవకులు రమాదేవి, సుజాత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.