
అన్నమయ్య: ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్
అన్నమయ్య జిల్లా పోలీసులు ఉల్లిపాయల వ్యాపారం మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మదనపల్లె–తిరుపతి రహదారిలోని యర్రగానిమిట్ట వద్ద వాహన తనిఖీల్లో నంబర్ లేని ఆటోలో ఉల్లిపాయల బస్తాల కింద దాచిన 179 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.44.65 లక్షలుగా అంచనా. ఈ కేసులో ఆవుల నాగరాజు (23), ఆవుల సుగుణ (29) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.






































