పిటిఎం మండలంలో గురువారం మల్లెల గ్రామానికి చెందిన రమణమ్మ (40) మరియు వెంకటేష్ (45) మల్లెల క్రాస్‌కు బైకులో వెళ్తుండగా, పులికల్లు వద్ద జింకల గుంపు ఎదురవడంతో బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు వారి పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.