మదనపల్లిలో శనివారం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినిని జెర్రి కాటేసింది. బసినికొండకు చెందిన ఆఫ్రో అంజుమ్ (16) జెడ్పీ హైస్కూల్లో జీవశాస్త్రం పరీక్ష రాస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్విజిలేటర్ సూచనతో నొప్పిని భరించుకుంటూ పరీక్ష పూర్తి చేసిన ఆమె, అనంతరం అస్వస్థతకు గురైంది. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకుంది.