అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త

169చూసినవారు
అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త
మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్‌పై ఎంపీడీవో తాజ్ మస్రూర్ బుధవారం కఠిన చర్యలు తీసుకున్నారు. సర్వే నంబర్ 758/4లో జరుగుతున్న ఈ లేఅవుట్ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు, తనిఖీలు చేపట్టారు. పంచాయతీ కేవలం చిన్న ఇళ్లకు మాత్రమే అనుమతిస్తుందని, లేఅవుట్లకు తప్పనిసరిగా 'హుడా' (PJM HUDA) అనుమతి ఉండాలని ఎంపీడీవో స్పష్టం చేశారు. అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్