మదనపల్లెలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ, యువత భగత్ సింగ్ ఆదర్శాలను అనుసరించి సామాజిక న్యాయం, ఆసియ సాధన కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన త్యాగం అపూర్వమని, 1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించిందని గుర్తుచేశారు.