యర్రపల్లిలో నామకరణ వేడుకలో వైఎస్సార్సీపీ నాయకులు

2834చూసినవారు
యర్రపల్లిలో నామకరణ వేడుకలో వైఎస్సార్సీపీ నాయకులు
అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం మూగవాడి పంచాయతీ యర్రపల్లి గ్రామంలో శంకర్, రేఖ దంపతుల పిల్లలు ప్రజ్ఞ, ప్రజిత్‌ల నామకరణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి వైఎస్ఆర్సిపి రామసముద్రం మండల కన్వీనర్ కేశవరెడ్డి, వైసిపి ఎంపీటీసీ రాధ కృష్ణరెడ్డి, బి. ల్. ఏ. సోము శేఖర్ హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. పిల్లలు ఆయురారోగ్యాలతో, విద్యా విజ్ఞానాల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్