సీఐ కళ వెంకటరావు దంపతుల నల్లవీర గంగాభవాని అమ్మవారి దర్శనం

926చూసినవారు
సీఐ కళ వెంకటరావు దంపతుల నల్లవీర గంగాభవాని అమ్మవారి దర్శనం
అన్నమయ్య జిల్లా మదనపల్లె తాలూకా సిటిఎం గ్రామంలో శ్రీ నల్లవీర గంగాభవాని అమ్మవారి జాతర సందర్భంగా గురువారం సీఐ కళ వెంకటరావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ సర్పంచ్, ఎంపీపీ, ఆలయ కమిటీ పెద్దలు సీఐ దంపతులను ఘనంగా సన్మానించారు. జాతర నిర్వహణలో పోలీసుల సహకారాన్ని ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. భక్తుల రద్దీ మధ్య జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్