గురువారం మదనపల్లె పట్టణంలోని సిటీఎం రోడ్డు, ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఓ వెల్డింగ్ షాపులో ప్రమాదం జరిగింది. దండువారిపల్లికి చెందిన ఖాదరవల్లి (40) అనే వెల్డర్ కమ్మిలు కత్తిరించే సమయంలో కట్టర్ అతని కాలుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. సహచరులు అతన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్న ఖాదరవల్లి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.