జనసేన వీర మహిళ ప్రత్యూష చేతుల మీదుగా పోలియో చుక్కలు పంపిణీ

2662చూసినవారు
జనసేన వీర మహిళ ప్రత్యూష చేతుల మీదుగా పోలియో చుక్కలు పంపిణీ
తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీమ్ మండలం రాపూరివారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో జనసేన వీర మహిళ ప్రత్యూష పాల్గొన్నారు. ఆమె చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్