మదనపల్లిలో పాము కాటేసి తండ్రి మృతి – కొడుకు పరిస్థితి విషమం

2761చూసినవారు
మదనపల్లిలో బుధవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. మదనపల్లికి చెందిన ఒక రాజకీయ నాయకుడి మామిడి తోటలో 40 ఏళ్లుగా కాపలాదారుగా పనిచేస్తున్న ఎరుకల నరసింహులు (56) పాము కాటుకు మృతి చెందాడు. మంగళవారం తోటకు ఆనుకుని ఉన్న వంక వద్ద చేపల వేటకు వెళ్లినప్పుడు పాము కాటు వేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతకు గురైన నరసింహులు కుటుంబ సభ్యులతో కలిసి తోటలో నివాసం ఉంటున్నాడు. అతని కొడుకు రాజు (36) పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్