చేనేతలకు ఉచిత విద్యుత్: కూటమి ప్రభుత్వం నిర్ణయం

1571చూసినవారు
చేనేతలకు ఉచిత విద్యుత్: కూటమి ప్రభుత్వం నిర్ణయం
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కోళ్ల బైలు పంచాయతీలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్ సదస్సు జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర మాట్లాడుతూ, ఏప్రిల్ 1, 2026 నుండి హ్యాండ్లూమ్ నేతన్నలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ నిర్ణయం చేనేత కార్మికులకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల నాయకులు, కార్మికులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్