గుర్రంకొండ: 108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం

890చూసినవారు
గుర్రంకొండ: 108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం
గుర్రంకొండకు చెందిన రిజ్వానా (19)కు మంగళవారం ప్రసవ నొప్పులు రావడంతో స్థానిక పిహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు మదనపల్లెకు రిఫర్ చేయగా, 108 అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే చేనేత నగర్ సమీపంలో ఆమె పండంటి మగబిడ్డకు సాధారణ ప్రసవం జరిగింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్