మృగశిర కార్తె ప్రభావంతో అన్నమయ్య జిల్లాలోని పెద్దమండ్యం మండలంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి మోస్తరు వర్షం మొదలైంది. వాతావరణం చల్లబడగా, వర్షం తగ్గకుండా కురుస్తోంది. ఈ తొలకరి చినుకులు తమ పంటలకు మేలు చేస్తాయని, సాగు పనులకు ఇదే సరైన సమయమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం ధాటికి ఏరువాక పనులు వేగవంతం కావడంతో రైతుల ముఖాల్లో కొత్త ఆశలు చిగురించాయి.