మదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 9, 633 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రజలు అందించిన విజయంగా భావిస్తున్నానని నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్ చినబాబు అన్నారు. తన విజయానికి సహకరించిన కూటమి నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చరిత్రలో ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. మదనపల్లి సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, సుభాష్, ప్రసాద్ బాబు లు అభినందనలు తెలియజేశారు.