మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి మనోహర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన సతీమణి బండి భారతి, మైఫోర్స్ మహేష్‌ను కలిసి మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం మైఫోర్స్ మహేష్ గెలుపొందిన బండి మనోహర్ మరియు బండి భారతిలను అభినందించారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.